డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజి కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం


తిరుపతిలోని టిటిడి శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో 2017-18వ విద్యాసంవత్సరానికి గాను మూడు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ మరియు క్యాటరింగ్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమానమైన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఎటువంటి వయోపరిమితి లేదు.

ఆసక్తి గల అభ్యర్థుల నుంచి జూలై 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూలై 10వ తేదీ కౌన్సెలింగ్‌ జరుగనుంది. కోర్సులో చేరిన మహిళా అభ్యర్థులకు ఉచిత హాస్టల్‌ మరియు భోజన సౌకర్యం కల్పిస్తారు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను 0877-2264603, 9912342019, 9550515496, 8985332244 నంబరులో సంప్రదించగలరు.

Source