టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జూలై నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.
- జూలై 1, 8, 15, 22, 29వ తేదీల్లో శనివారం కావడంతో ఉదయం 6.00 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. రూ.20/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. సాయంత్రం 6.00 గంటలకు శ్రీసీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామివారు బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్సేవ నిర్వహిస్తారు.
- జూలై 9వ తేదీ పౌర్ణమి నాడు ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. రూ.50/- చెల్లించి ఒక్కరు పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారిని నాలుగు మాడ వీధుల ద్వారా రామచంద్ర పుష్కరిణి వరకు ఊరేగింపు, ఆస్థానం నిర్వహిస్తారు.
- జూలై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.
- జూలై 23వ తేదీ అమావాస్య మరియు పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 6.00 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.
Source