తిరుమల తిరుపతి దేవస్థానములకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. పర్యావరణ అనుకూల భవంతుల నిర్మాణం చేపట్టినందుకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజిబిసి) ఈ మేరకు అవార్డును ప్రకటించింది.
టిటిడి తరఫున తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ శుక్రవారం సాయంత్రం ఈ అవార్డును రాష్ట్ర మంత్రి శ్రీ నారాయణ చేతులమీదుగా అందుకున్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐజిబిసి ప్రతినిధులు పాల్గొన్నారు.
Source