మార్చి 14 నుండి 21 వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 523వ వర్ధంతి ఉత్సవాలు

 

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలను మార్చి 14 నుండి 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ ఉత్సవాలు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం మరియు మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి.

మార్చి 15న సంకీర్తన గోష్టిగానం

  • మార్చి 14వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది.
  • మార్చి 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తన గోష్టిగానం నిర్వహించనున్నారు.

సాహితీ సదస్సులు, భక్తి సంగీత కార్యక్రమాలు

  • మార్చి 15 నుండి 21వ తేదీ వరకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు సాహితీ సదస్సులు, సాయంత్రం భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
  • తాళ్లపాకలోని ధ్యానమందిరం మరియు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక మరియు భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

మహతి కళాక్షేత్రంలో సంగీత సభ

  • మార్చి 16 నుండి 18వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సంగీత సభలు నిర్వహించనున్నారు.