తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రెండోవ రోజు శ్రీదేవి భూదేవి సమేత స్వామి వారు హంస వాహనంపై ఊరేగారు. ఫిబ్రవరి 18న సింహ వాహనంపై ఊరేగుతూ కనువిందు చేసారు.
ఇతర వాహన సేవల వివరాలు ఇలా...
- ఫిబ్రవరి 19న హనుమంత వాహనం,
- ఫిబ్రవరి 20న సాయంత్రం 5 గంటలకు కల్యాణోత్సవం, రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా సాగనున్నాయి.
- ఫిబ్రవరి 21న గజవాహనం,
- ఫిబ్రవరి 22న చంద్రప్రభ వాహనం,
- ఫిబ్రవరి 23న ఉదయం తిరుచ్చి, రాత్రి అశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 24న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 25న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.