నవదుర్గలు అంటే దుర్గా దేవి యొక్క తొమ్మిది అవతారాలు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దేవీ నవరాత్రుల్లో ఆరవరోజు దుర్గామాత కాత్యాయిని దేవిగా దర్శనమిస్తుంది. ఆ మాతను ఈ శ్లోకాలతో కీర్తిస్తే కాత్యాయిని మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
కాత్యాయనీ దేవి మంత్రం
ఓం దేవీ కాత్యాయన్యై నమః
కాత్యాయినీ దేవి ధ్యానం
వందేవాంఛిత మనోరదార్థ చంద్రార్ధ కృత శేఖరాం
సింహారూఢ చతుర్భుజ కాత్యాయనీ యశస్వినీమ్
స్వర్ణవర్ణా ఆజ్ఞాచక్ర స్ధితాం షష్టందుర్గా త్రినేత్రాం
వరాభీతాంకరాం షగపతధరాం కాత్యాయన సుతాం భజామి
పీతాంబర పరిధానం స్మేరముఖీం నానాలంకార భూషితం
మంజీరహార కేయూర కింకిణీ రత్నకుండలమండితామ్
ప్రసన్నవదనా పల్లవాధారాం కాంత కపోలాం తుగమకుచాం
కమనీయాం లావణ్యాం త్రివళి విభూషితమ్ నిమ్న నభీమ్
కాత్యాయినీదేవి స్తోత్రం
కాంచనాభాం వరాభయం పద్మధరాముకుటోజ్జ్వలాం
స్మేరముఖీ శివపత్ని కాత్యాయనేసుతే నమోస్తుతే
పీతాంబర పరిధానం నానాలంకార భూషితాం
సింహస్థితం పద్మహస్తంకాత్యాయనసుతే నమోస్తుతే
పరమానందమయూ దేవి పరబ్రహ్మ పరమాత్మ
పరమశక్తి పరమభక్తి కాత్యాయనసుతే నమోస్తుతే
విశ్వకర్త్రీ విశ్వభర్త్రీ విశ్వహర్త్రీ విశ్వప్రీతా విశ్వవాంఛిత
విశ్వాచింతా విశ్వాతీతా కాత్యాయనసుతే నమోస్తుతే
కాం బీజా, కాం జపానందకాం బీజజపతోషితే
కాంకాం బీజ జపదాసక్తకాం సంతుతా
కంకార హర్షిణీకామ్ ధనదాధర మాసనా
కామ్ బీజ జపకారిణీకాం బీజ తపమానసా
కాంకారిణీకాం మంత్ర పూజితా కాం బీజధారిణీం
కాంకీం కూంకైకః ఠః, ఛః స్వాహారూపిణీ