అమెరికాలో పెద్ద ఎత్తున శ్రీనివాస కల్యాణోత్సవాలు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రక్రియలో భాగంగా అమెరికా దేశంలో స్థిరపడిన భారతీయులు, తెలుగువారి కోసం జూలై 05 నుండి సెప్టెంబర్ 01 వరకు 8 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను టిటిడి నిర్వహించనుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమెరికాలోని ప్రవాస భారతీయుల కోసం శ్రీవారి కళ్యాణాలను టిటిడి చేపడుతోంది. టిటిడి కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (ఎన్.ఏ.టి.ఎస్.) మరియు నార్త్ టెక్సాస్ హిందూ సొసైటీ (ఎన్. టి. హెచ్.ఎస్.) మద్దతుతో అమెరికాలోని 8 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవాలు నిర్వహించే ప్రాంతాలు

  • జూలై 05న ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా, 
  • జూలై 12న నార్త్ కరోలిన రాష్ట్రంలోని ర్యాలీ , 
  • జూలై 19న న్యూజెర్సీ రాష్ట్రంలోని న్యూజెర్సీ, 
  • జూలై 26న మిస్సోరీ రాష్ట్రంలోని సెయింట్ లూయిస్, 
  • ఆగష్టు 02న ఇల్లినాయ్ రాష్ట్రంలోని చికాగో, 
  • ఆగష్టు 16న వాషింగ్టన్ రాష్ట్రంలోని సీటెల్, 
  • ఆగష్టు 23న జార్జియా రాష్ట్రంలోని అట్లాంట,
  • సెప్టెంబర్ 01న టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ 

అమెరికా దేశంలో శ్రీనివాస కళ్యాణోత్సవాలకు సమన్వయకర్తగా శ్రీ శ్రీధర్ గొట్టిపాటి వ్యవహరించనున్నారు.

ప్రపంచం వ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతోంది.