మే నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

 

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  •  మే 2, 9, 16, 23, 30వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు.
  •  మే 6న ఉద‌యం 6 గంట‌ల‌కు ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.
  •  మే 10న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌సంతోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.
  •  మే 11 నుండి 13వ తేదీ వ‌ర‌కు అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు.
  •  మే 12న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.45 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం.
  •  మే 18న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.

శ్రీ బ‌ల‌రామ‌కృష్ణ స్వామి ఆలయంలో..

మే 27వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.