తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మే 2వ తేదీ వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవం జరుగనుంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు.