సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క‌టాక్షం

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో సింహ‌ వాహనంపై భక్తులను క‌టాక్షించారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 26 వరకు వైభవంగా జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.