తిరుమలలో 25 రోజుల పాటు అధ్యయనోత్సవాలు పూర్తయిన సందర్భంగా మరుసటి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు శుక్రవారం సాయంత్రం దక్షిణ మాడ వీధిలో తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేశారు.
సహస్ర దీపాలంకార సేవ అనంతరం సన్నిధికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.