తిరుమల మొదటి కనుమ రహదారిలో గల అక్కగార్ల గుడిలో ఏడుగురు అక్కగార్లకు శుక్రవారం ఉదయం టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజ ఘనంగా నిర్వహించారు.
అక్కదేవతలకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో అక్కగార్లకు సారె సమర్పించారు. కనుమ రోడ్డులో భక్తులు సురక్షితంగా ప్రయాణాలు సాగించేలా అనుగ్రహించాలని అక్కగార్లను ప్రార్థించారు.