తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.