కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ప్రారంభం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన నిర్వహి౦చారు.

కాగా, నవంబ‌రు 6, 7వ తేదీల్లో కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబ‌రు 7న‌ సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.