తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 8 నుండి 11 గంటల వరకు యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలపూజ, హోమం, పట్టు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు.