ఘనంగా అప్పలాయగుంట బ్రహ్మోత్సవాలు

 

హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శనివారం ఉదయం 7 గంటలకు హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

మ‌ధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహించారు. 

గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి కటాక్షం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి గజవాహనంపై భక్తులను కటాక్షించారు.

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి కలుగుతాయి.