వివిధ వాహనాలపై కనువిందు చేస్తున్న కోదండరామయ్య

గ‌రుడ‌ వాహనం

తిరుపతిలో కోదండరాస శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ‌రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు గ‌రుడ‌ వాహనంపై స్వామివారు క‌టాక్షించారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

గరుత్మంతుడు శ్రీమహావిష్ణువుకు నిత్యవాహనం. 108 దివ్య దేశాలలోనూ గరుడ సేవ విశిష్టమైనది.

హనుమంత వాహనం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు బుధ‌వారం ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు.

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు.

అనంతరం ఉదయం 10.30 గంటల నుండి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరాములవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంలతో అభిషేకం చేశారు..

గజ వాహనం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. 

గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.   

హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు శ్రీవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు.

సూర్యప్రభ వాహనం

తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం ఉదయం 8 గంటలకు స్వామివారు సూర్యప్రభ వాహనంపై దేదీప్యమానంగా ప్రకాశించారు.

ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు తేజోనిధి. సకలరోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి.

అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. వాహ‌న‌సేవ‌లలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.