ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న ఏర్పాట్లు

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

బ్రహ్మోత్సవాల వివరాలు

ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 22వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.