అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవానికి సన్నాహాలు పూర్తయ్యాయి. హిందువుల చిరకాల వాంఛ అయిన రామమందిర నిర్మాణం పూర్తయింది. ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా, దేశంలో మూడవ అతిపెద్ద ఆలయంగా అయోధ్య రామ మందిరం ముస్తాబవుతోంది. శ్రీరామ నామంతో దేశమంతా రామభక్తి మయం అయిపోయింది. జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి, బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించ నున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూడడానికి దేశం మొత్తం సిద్ధమవుతోంది.
అయోధ్యరామయ్యకు విశేష పూజలు
అయోధ్య రామయ్యకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు వచ్చింది. తిరుమల వెంకటేశ్వర స్వామి తరహాలో అయోధ్య ఆలయాన్ని తీర్చిదిద్దడానికి సంకల్పించారు ఆలయ ట్రస్టు అధికారులు. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు రాములవారికి విశేష పూజలు, సేవలతో పాటు నిత్యం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ కార్యక్రమాలన్నింటినీ దేశ విదేశాలలో ప్రజలకు చూపించే ప్రయత్నం చేయనుంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
అయోధ్య రామయ్య భక్తి ఛానల్
అయోధ్య రామయ్యకు కూడా భక్తి ఛానల్ ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఉన్నట్టు సమాచారం. తిరుమల వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉన్నట్టుగానే, అయోధ్య రాముడి కోసం శాటిలైట్ ఛానల్ తీసుకురావాలనే ఆలోచన చేస్తున్న ట్రస్ట్ ఆ పని త్వరలో మొదలుపెట్టనుంది.
ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత అయోధ్యకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం, అయోధ్యలో జరుగుతున్న విశేష పూజలకు సంబంధించిన సమాచారాన్ని చానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. అదే తరహాలో రైల్వే టెర్మినల్, బస్టాండ్ లతోపాటు, ప్రముఖ హోటల్స్ ఏర్పాటు కూడా జరుగుతోంది. ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు అయోధ్యకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా అయోధ్య అన్ని హంగులతో సిద్ధమవుతోంది.
శక్తివంతమైన శ్రీరామ ప్రతిష్ఠ యంత్రం
అత్యంత శక్తివంతమైన అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ యంత్రం సమర్పించిన అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్లకు చెందిన అన్నదానం చిదంబరశాస్త్రి.