తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం మొత్తాన్ని, పూజా సామగ్రిని శుద్ధిచేసి సుగంధ ద్రవ్యాలతో ప్రోక్షణం చేశారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు.