తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 23వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది.
ఉత్సవాలు ఇలా...
సెప్టెంబరు 26న కలశస్థాపన, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా
- సెప్టెంబరు 27న శ్రీ కామాక్షి దేవి,
- సెప్టెంబరు 28న శ్రీ ఆదిపరాశక్తి,
- సెప్టెంబరు 29న మావడిసేవ అలంకారం,
- సెప్టెంబరు 30న శ్రీ అన్నపూర్ణాదేవి,
- అక్టోబరు 1న శ్రీ మహాలక్ష్మి, అక్టోబరు 2న శ్రీ సరస్వతి దేవి,
- అక్టోబరు 3న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 4న శ్రీ మహిషాసురమర్థిని,
- అక్టోబరు 5న విజయదశమి సందర్భంగా శ్రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.