వైభవంగా ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు

తిరుచానూరులో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు 14వ తేదీ మంగ‌ళ‌వారంతో ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3.30 నుండి 5.00 గంటల వరకు నీరాడ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

వైభవోపేతంగా తెప్పోత్సవం

సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారు ఏడు చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.