తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమం శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా ముగిసింది.
ఆలయంలో ఐదు రోజుల పాటు అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి.
ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు భగవత్ ప్రార్ధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణనయం, ప్రధాన కళాశాల వాహన, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు మహా పూర్ణాహూతి, ఉదయం 9.30 గంటలకు విమాన గోపుర శిఖర ఆవాహన, మూలస్థాన వాహనం నిర్వహించారు. మధ్యాహ్నం 12.10 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.