జ‌న‌వ‌రి 27న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం


కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 27వ తేదీన 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.





బుధ‌వారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 186 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.





Source