తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి అంగరంగవైభవంగా జరుగనున్నాయి.
ఉత్సవాల వివరాలు
- ఫిబ్రవరి 19: సూర్య వాహనం, చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ధూపసేవ, ముద్రికాలంకరణ ఉంటాయి.
- ఫిబ్రవరి 20: గరుడ పుష్పక, పుష్పక వాహనాలపై గ్రామోత్సవం జరుగుతుంది.
- ఫిబ్రవరి 21: హంస వాహనం, శేషవాహనాలపై గ్రామోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి.
- ఫిబ్రవరి 22: పంచముఖ ఆంజనేయస్వామి, కంచు గరుడ వాహనాలపై గ్రామోత్సవం, రాత్రి స్వామివారి తిరుకళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 23: మధ్యాహ్నం 2.30 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది.
- ఫిబ్రవరి 24: గజవాహనం, పొన్న వాహనాలపై స్వామివారు ఊరేగి భక్తులకు కనువిందు చేస్తారు. రాత్రి అన్నపర్వత మహానివేదన కార్యక్రమం జరుగుతుంది.
- ఫిబ్రవరి 25: హనుమద్వాహనసేవ, సింహవాహనసేవలు జరుగుతాయి. సాయంత్రం సదస్యం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 26: రాజాధిరాజ, అశ్వవాహనంపై గ్రామోత్సవం, రాత్రి చోరసంవాదం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 27: మాఘపౌర్ణమి చక్రవారి సముద్రస్నానం, ఉదయం గరుడ పుష్పకవాహనంపై గ్రామోత్సవం, చక్రవారి అవభృథోత్సవం, రాత్రి ధ్వజ అవరోహణ జరుగుతాయి.
- ఫిబ్రవరి 28: పుష్పకవాహనంపై గ్రామోత్సవం, చెరువులో హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం, రాత్రి తిరుమంజనంతో ప్రారంభమై పవళింపుసేవతో స్వామి వేడుకలు ముగుస్తాయి.