తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం ఉదయం పల్లకీపై గోదాదేవి అలంకారంలో శ్రీ అలమేలుమంగ అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
2 గొడుగులు విరాళం
తమిళనాడులోని తిరునిన్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు ప్రతినిధులు 2 గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద జెఇఓ శ్రీ పి.బసంత్ కుమార్ కు అందించారు. వీరు 18 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో గజ వాహనం రోజు గొడుగులు అందిస్తున్నారు.