తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 29 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు దేవీ నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
దేవీనవరాత్రి ఉత్సవాల వివరాలు సెప్టెంబరు 29న కలశస్థాపనతో ప్రారంభమై, అక్టోబరు 8న కలశాభిషేకం, పార్వేటి ఉత్సవంతో ముగుస్తాయి.సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం స్నపన తిరుమంజనం జరుగుతుంది. సాయంత్రం ఊంజల్‌సేవలో శ్రీకామాక్షి అమ్మవారు ప్రత్యేక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
అమ్మవారి అవతారాలు
- సెప్టెంబరు 30న శ్రీ కామాక్షి దేవి,
- అక్టోబరు 1న ఆదిపరాశక్తి,
- అక్టోబరు 2న శ్రీ అన్నపూర్ణాదేవి,
- అక్టోబరు 3న మావడి సేవ,
- అక్టోబరు 4న శ్రీ లక్ష్మీదేవి,
- అక్టోబరు 5న శ్రీ దుర్గాదేవి,
- అక్టోబరు 6న శ్రీ సరస్వతి దేవి,
- అక్టోబరు 7న శ్రీ మహిషాసురమర్థిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
- అక్టోబరు 8న విజయదశమినాడు శ్రీ శివపార్వతులు దర్శనమిస్తారు, అదేరోజు పార్వేట ఉత్సవం జరుగుతుంది.