ఘ‌నంగా శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆస్థానం


తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీక‌వ‌ల్లి అమ్మ‌వారికి ఘ‌నంగా ఆస్థానం జ‌రిగింది.





ఈ సంద‌ర్భంగా ఉద‌యం అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ (గోదాదేవి) అమ్మవారికి లక్ష్మీ మండపంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఇందులో వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంగీత కార్యక్రమాలు వీనులవిందుగా సాగాయి.





అనంతరం చిన్నమాడ వీధిలో ఊరేగింపు జ‌రిగింది. ఆ తరువాత శ్రీ ఆండాళ్, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయాల్లో శ్రీశ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి సమక్షంలో శుక్రవార ఆస్థానం నిర్వహించారు.





Source