శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును. ఆగస్టు 2వ తేదీ నుంచి శ్రావణమాసం ప్రవేశిస్తోంది. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది.
శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామగ్రి
- పసుపు 100 గ్రాములు
- కుంకుమ100 గ్రాములు.
- గంధం చెక్క
- విడిపూలు, పూల దండలు - 6
- తమల పాకులు -వక్కలు
- వంద గ్రాముల ఖర్జూరములు
- అగరవత్తులు
- కర్పూరము
- ౩౦ రూపాయి నాణాలు
- ఒక తెల్ల తువ్వాలు
- జాకెట్టు ముక్కలు రెండు(ఎరుపురంగులో ఉన్నది అయితే మంచిది)
- మామిడి ఆకులు
- అరటిపండ్లు ఒక డజన్
- ఇతర ఐదు రకాల ఇతర పండ్లు
- అమ్మవారి ఫోటో
- కలశం కోసం ఇత్తడి లేక రాగి లేక వెండి చెంబు
- కొబ్బరి కాయలు రెండు
- తెల్లదారము రీలు ఒకటి
- నైవేద్యాలు : మన స్థోమతను బట్టి ఐదు లేదా 9 లేదా 11 రకాలు( చలిమిడి, వడపప్పు, పానకం తప్పనిసరిగా ఉండాలి)
- బియ్యం 2 కిలోలు
- కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు
- దీపాలు : రెండు
- గంట
- హారతి ప్లేటు
- చెమ్చాలు
- పెద్ద ఇత్తడి పళ్ళాలు
- ఆవు నెయ్యి లేదా కొబ్బరినూనె తామర వత్తులు లేదా పత్తి వత్తులు
- అగ్గిపెట్టె
- పంచపాత్రలు: 2
- చిన్న గిన్నెలు : 2
- చెక్క పీట: 1
- వరిపిండి : కొద్దిగా
- నానబెట్టిన శనగలు పావు కిలో
- కొత్త గాజులు,