అగస్తీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, మ‌త్స్య జ‌యంతి


టిటిడి ప‌రిధిలోని నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మరగదవల్లీ సమేత అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.





బ్రహ్మోత్సవాల వివరాలు





  • ఏప్రిల్ 14న నంది వాహనం,
  • ఏప్రిల్‌ 17న కల్యాణోత్సవం,
  • ఏప్రిల్ 18న రావణేశ్వర వాహనం,
  • ఏప్రిల్ 19న కైలాసకోనలో త్రిశూలస్నానం




ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ కోలాటం, ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.





శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయ చరిత్ర





శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయ చరిత్రను పరిశీలిస్తే నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు పితామహులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. స్వామివారి లింగాకారానికి పీఠభాగం అనగా బాణపట్టమును అమర్చి వేద ఆగమశాస్త్ర ప్రకారం శ్రీ అగస్త్య మహర్షులవారు ప్రతిష్ఠ చేసి పూజించినందువల్ల స్వామివారికి అగస్తీశ్వరస్వామి అని పేరు వచ్చింది.





ఏప్రిల్ 8న మత్స్య జయంతి





అదేవిధంగా, టిటిడికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 8వ తేదీన మత్స్య జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉదయం 8.30 నుండి 11.00 గంటల వరకు శాంతిహోమం, స్న‌పన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాఢవీదులలో ఉరేగి భక్తులను అనుగ్రహిస్తారు.