పంచమితీర్థ మహోత్సవంతో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన కార్తీక బ్ర‌హ్మోత్సవాలు బుధ‌వారం పంచమితీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.

చివరిరోజు ఆలయం వద్ద గల పద్మ పుష్కరిణిలో జరిగిన చక్రస్నానం కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి పవిత్రస్నానాలు ఆచరించారు. ఈ ఉత్సవానికి విచ్చేసిన అశేష భక్తజనవాహినికి ఎలాంటి రాజీకి తావులేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది.