తిరుచానూరు లోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 22వ తేదీ శనివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. సెప్టెంబరు 23 నుండి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. శనివారం సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్ర అధివశం నిర్వహిస్తారు.
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబరు 23వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 24న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 25న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
Source