నైవేద్యం పెట్టేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి?

దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో నిర్ధిష్టమైన కొన్ని నియమాలను మనం ఎప్పుడూ పాటించవలసి ఉంటుంది. షోడశోపచార పూజలో నైవేద్యం కూడా ఒక భాగం. పూజలో మనం , ధూపం, దీపం, నైవేద్యం, హారతి ఇలా వరుసక్రమంగా పాటిస్తూ ఉంటాం. అసలు ఈ నైవేద్యం దేవునికి ఎలా సమర్పించాలి. వాటికి పాటించవలసిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

నైవేద్యం - నియమాలు



  • నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. ప్లాస్టిక్, మరియు స్టీలు, లేదా గాజు గిన్నెలలో పెట్టకూడదు.

  • నైవేద్యం ఎప్పుడూ కూడా వేడిగా పొగలు గక్కుతూ అస్సలు ఉండరాదు. గోరువెచ్చగా అయిన తరువాత మాత్రమే నైవేద్యం సమర్పించాలి.

  • నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా, మనం తినేందుకు వేరుగా ఉండకూడదు. దేవునికి పెట్టిన నైవేద్యం మనం ప్రసాదంగా సేవించాలి.

  • నిలవ ఉన్నవీ, పులిసిపోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు.

  • తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ దేవుని మందిరంలో నైవేద్యాన్ని యజమాని , యజమానురాలు మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు .

  • అతి పులుపు, అతి అతికారం గల నైవేద్యాలను దేవునికి సమర్పించ కూడదు.

  • దేవునికి నైవేద్యం పెట్టే పదార్థాలు ముందుగా రుచి చూడకూడదు,

  • మనం ఇంట్లో నివేదనకు అర్హమైన వాటిని ఏవి తయారు చేసినా అవి భగవత్ సమర్పణ చేసిన తరువాతనే తినాలి.

  • భగవంతునికి నైవేద్యం పెట్టిన తరువాత కొంత సమయం అయ్యాక వాటిని మీరు తినాలి. మీరు కానీ, మీ పిల్లలు కాని అప్పటికే రుచి చూసిన పదార్ధాలు భగవంతుని నివేదనకు పనికిరావు.

  • ఉల్లి, వెల్లుల్లి పదార్ధాలు నివేదన చేయకూడదు.

  • నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాలి.

  • నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి.

  • ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

  • నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. కుటుంబంలో నైవేద్యం కుటుంబ యజమాని పెట్టవచ్చు. ఇతరులు చేసిన నైవేద్యం వారి పేరుతో పెట్టాలి. ఆలయంలో మీరు దేవునికి ప్రసాదం తయారు చేసి ఇస్తే వాటిని మీ పేరుతో నైవేద్యం పెడతారు.

  • నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభికారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి.

  • నైవేద్యం పెట్టే సమయంలో ఆహారా పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి.

  • ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.

  • ముందుగా గాయత్రీ మంత్రం పఠించి తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా , అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి దేవతలకు చూపించాలి.

  • మధ్యే మధ్యే పానీయం సమర్పయామి...హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి... అని నైవేద్యం మీద మళ్ళ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. అనంతరం నమస్కరోమి అని సా ష్ఠాంగం చేసి లేవాలి.