నైవేద్యం విషయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి?

గర్భగుడిలో కొలువైన దైవానికే కాదు ... ఇంట్లోని పూజా మందిరంలో నెలవైన దైవానికి కూడా నైవేద్యం పెట్టవలసిందే. చేసేది నిత్యపూజ అయినా ... విశేష పుణ్యతిథుల్లో చేసే ప్రత్యేక పూజే అయినా నైవేద్యం తప్పనిసరిగా సమర్పించవలసిందే. దైవానికి జరిపే ఉపచారాలలో నైవేద్యానికి ఎంతో విశిష్టత వుంది. దైవంపై మనకి గల భక్తిశ్రద్ధలు బయటపడేది ఈ నైవేద్యాల విషయంలోనే. ఈ కారణంగానే ఇష్ట దైవాలకిగల ఇష్టాలు తెలుసుకుని మరీ నైవేద్యాలు తయారు చేసేందుకు సిద్ధపడతారు.

దైవానికి ఎలాంటి లోటూ జరగకూడదనే ఉద్దేశంతో, వివిధ రకాల నైవేద్యాలను తయారు చేస్తారు. వాటిలో కొన్ని తీపి పదార్థాలు ... మరికొన్ని కారంతో కూడిన పదార్థాలు ఉంటూవుంటాయి. దైవానికి సమర్పించే నైవేద్యాలు ఎంతో రుచిగా ... శుచిగా ఉండాలనే ఉద్దేశంతోనే అంతా ఎంతగానో కష్టపడతారు. దేవుడి ఆరాధనలో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. అయితే వాటిలో ప్రధానమైనది నైవేద్యం సమర్పించడం. ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైన మరియు దేవుని దయ పూర్తిగా దక్కే మార్గం.

అయితే ఈ నైవేద్యం విషయంలో మనం తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం.

నైవేద్యం పెట్టే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు



  • నైవేద్యం ఎప్పుడూ వెండి, బంగారం, లేదా రాగి పాత్రల్లోనే పెట్టాలి. నైవేద్యం ఎప్పుడు కూడా ప్లాస్టిక్, మరియు స్టీల్, లేదా గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు.

  • నైవేద్యం ఎప్పుడు కూడా వేడిగా అస్సలు ఉండరాదు. గోరువెచ్చగా అయిన తరువాత నైవేద్యం సంమర్పించాలి.

  • అప్పటికప్పుడు సిద్ధం చేసినవి చాలా వేడిగా వుంటాయి కనుక వాటిని నైవేద్యం పెట్టకూడదని అంటోంది.

  • నైవేద్యం ఎప్పుడు కూడా చేసింది చేసినట్టుగా పెట్టాలి. కానీ దేవుడు కోసం విడిగా, మనం తినేందుకు

  • నిలవ ఉన్నవీ, పులిసిపోయినవనీ అయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు.

  • తమ సొంత ఇంట్లోనూ, తమ సొంత ఆఫీసులోనూ దేవుని మందిరంలో నైవేద్యాన్ని తాము గ్రుహిణి, గ్రుహస్తుడు లేదా యజమానుడు , యజమానురాలు) మాత్రమే స్వయంగా గానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు గానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు .
    అతి పులుపు, అతి అతికారం గల నైవేద్యాలను దేవునికి సమర్పించ కూడదు.
    దేవునికి నైవేద్యం పెట్టే పదార్థాలు ముందుగా రుచి చూడకూడదు,

  • భగవంతునికి నైవేద్యం పెట్టిన తరువాతర కొంత సమయం అయ్యాక వాటిని మీరు తినాలి. మీరు కానీ, మీ పిల్లలు కాని అప్పటికే రుచి చేసిన పదార్ధాలు భగవంతుని నివేదనకు పనికిరావు.
    నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి. అది కూడా ఎవరైతే నైవేద్యం దేవుడికి పెడతారో వాళ్లే హారతి కూడా ఇవ్వాలి.

  • నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది. నైవేద్యం పెట్టిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే వదిలేసి మనం పూజగదిలో నుండి వచ్చేయాలి. ఇలాగా చేస్తే దేవుడి చూపు ఆ ప్రసాదం పైన పడుతుంది. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

  • నైవేద్యం ఎవరైతే వండుతారో వాళ్లే నైవేద్యం దేవుడికి సమర్పించాలి. అంటే కుటుంబంలో పెట్టిన నైవేద్యం కుటుంబ యజమాని పెట్ట వచ్చు.

  • ఇతరులు చేసిన నైవేద్యం వారి పేరుతో పెట్టాలి. ఆలయంలో మీరు దేవునికి ప్రసాదం తయారు చేసి ఇస్తే వాటిని మీ రేపుతో నైవేద్యం పెడతారు.

  • నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి.

  • నైవేద్యం పెట్టే సమయంలో ఆహారా పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతా స్త్రోత్రం చదవాలి.

  • ఏ కులస్థులైనా సరే, ఏ దేవీ దేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి.
    తర్వాత ఓం ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా , ఓమ్ బ్రహ్మణే స్వాహా , అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి దేవతలకు చూపించాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అని నైవేద్యే పానీయం సమర్పయామి అని నైవేద్యం మీద మళ్ళ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాస్టాంగం చేసి లేవాలి. నైవేద్యం ఇలా పెడితే చాలా మంచిది.

  • నైవేద్యం కోసం ఏ పదార్థాలను వేడిగా తయారుచేసినా అవి గోరువెచ్చగా వున్నప్పుడు మాత్రమే దైవానికి సమర్పించాలని స్పష్టం చేస్తోంది.