టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన అఖండం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఇతర కళాకారులు గురువారం సాయంత్రం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా సంకీర్తనలను ఆలపిస్తారు.
ముందుగా టిటిడి పరిపాలనా భవనంలో అన్నమయ్య చెక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుచ్చిపై వేంచేపు చేసి శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా సంకీర్తనలు ఆలపిస్తూ అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ్లారు.
Source