తిరుమలలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 16వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి.

ఉదయం ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేపట్టారు.

బంగారు కూర్చ సిద్ధం


శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణలో వినియోగించే బంగారుకూర్చను టిటిడి సిద్ధం చేసింది. 300 గ్రాముల బంగారంతో దీనిని తయారుచేశారు. సాధారణంగా వైదిక కార్యక్రమాల్లో అర్చకులు దర్భలతో చేసిన కూర్చలను వినియోగిస్తారు. కూర్చలోకి మంత్రావాహన చేసి వైదిక క్రతువులకు ఉపయోగిస్తారు. శ్రీవారి మూలమూర్తిని ఆవాహన చేసిన బంగారు కలశంతోపాటు ఈ బంగారు కూర్చను యాగశాలలో ప్రతిష్టిస్తారు.

Source