శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకానికి ఏర్పాట్లు పూర్తి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 22వ తేదీ ఆదివారం నుండి మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా స్వామివారి స్వర్ణ కవచాలకు మొదటిరోజు కవచ అధివశం, రెండో రోజు కవచ ప్రతిష్ఠ, మూడో రోజు కవచ సమర్పణ చేపడతారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.

Source