తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమానికి మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఆలయం వద్దగల గంగుండ్ర మండపంలో మే 2 నుండి 6వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణం జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శుక్రవారపుతోటలో మేదినీపూజ, శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.

మే 2న అకల్మషప్రాయశ్చిత్తహోమం, కలశస్థాపన, మే 3న అష్టబంధన పూజ, అష్టబంధన హోమం, 4న అష్టబంధనం, అధివాసత్రయం, సర్వదైవత్యహోమం, మే 5న మహాశాంతిజప్యం, మహాశాంతి అభిషేకం, మే 6న ఉదయం మహాపూర్ణాహుతి, ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మహాసంప్రోక్షణ, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు అశ్వవాహన సేవ జరుగనున్నాయి.

Source