తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ 26 నుండి మే 7వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు గోడపత్రికలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఏప్రిల్ 29వ తేదీన ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 3న గరుడసేవ, మే 6న రథోత్సవం, మే 7న ఉదయం 10 గంటలకు చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు.
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి వాహనసేవలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
Source