శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ

సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాల గోడపత్రికలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఈవో కార్యాలయంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

మార్చి 13 నుండి 17వ తేదీ వరకు అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు జరుగనున్నాయి. మార్చి 13వ తేదీన టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మెట్లోత్సవం నిర్వహిస్తారు. మార్చి 14వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్టిగానం, సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

మార్చి 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.

Source