సర్వ అమావాస్య -సోమవారం అమావాస్య కలిసి వస్తే ఆరోజును సర్వ అమావాస్య, సోమవార అమావాస్యగా పిలుస్తారు. ఈ సర్వ అమావాస్య రోజున గంగ, గోదావరి, తుంగభద్ర వంటి పుణ్యతీర్థాల్లో స్నానమాచరించేవారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యతీర్థాల్లో స్నానమాచరించి, శివునికి నేతిదీపం వెలిగించే వారికి పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే పితృదేవతలను తృప్తిపరచేందుకు అర్ఘ్య సమర్పణ చేయడం ద్వారా వారి ఆశీస్సులను పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి.
https://youtu.be/ax3_wZqu3mM