గ్రహపీడా నివారణ కోసం కోసం ప్రదోష వ్రతం చేయండిలా

దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. శనివారం, త్రయోదశి, ప్రదోషం మూడూ కలిస్తే అవి శుభఘడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడా నివారణకు, శని ప్రభావంతో ఇక్కట్ల పాలవుతున్నవారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహ కాలంగా పరిగణిస్తారు. ప్రదోషకాలం అంటే ఏమిటి, ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకోండి.

ప్రదోష వ్రతం


శివ పార్వతుల అనుగ్రహం కోసం ప్రతినెలా బహుళ త్రయోదశి నాడు రాత్రి అంటే ప్రదోష కాలంలో ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే శుద్ధ త్రయోదశి నాడు కూడా ఈ పూజ జరపవచ్చని ధర్మ శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి. వీలైతే రెండు సార్లూ ఈ ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు. ప్రతిరోజూ సూర్యాస్తమయానికి 72 నిమిషాల ముందు ప్రదోష సమయం ప్రారంభమవుతుంది. ప్రదిదినం ప్రదోష కాలంలో పరమేశ్వరుని దర్శనం శుభప్రదం. అలాంటిది త్రయోదశి నాడు ప్రదోష వ్రతం చేసుకుంటే శివానుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు.

ఈ ప్రదోషం వ్రతం రోజు అంటే త్రయోదశి తిధి సోమవారం నాడు వస్తే సోమ ప్రదోషమని, మంగళవారం వస్తే భౌమ ప్రదోషమని, శనివారం నాడు వస్తే శని ప్రదోషమని పేర్కొంటారు. ప్రదోష వ్రతాన్ని నిత్యప్రదోషం, పక్ష ప్రదోషం, మాస ప్రదోషం, మహా ప్రదోషం, ప్రళయ ప్రదోషం పేరిట ఆచరిస్తారు. శుద్ధ త్రయోదశి నాడు జరిపే వ్రతాన్ని పక్ష ప్రదోషమని, బహుళ త్రయోదశి నాడు వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషమని పేర్కొంటారు. శనివారం వచ్చే బహుళ త్రయోదశి మహా ప్రదోషంగా, విశ్వం శివునిలో ఐక్యమయ్యే సందర్భంగా వచ్చే ప్రదోషం ప్రళయ ప్రదోషంగా పేర్కొనబడతాయి. జనవరి 14వ తేదీన ఆదివారం ప్రదోషం రానున్నది. ఆతర్వాత జనవరి 29న సోమ ప్రదోష వతంగా ఆచరించాల్సి ఉంటుంది.

వ్రతం ఆచరించే విధానం


వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేనివారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు, పండ్లు వంటివి తిని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి, మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి. అంటే వ్రతం నాడు పక్వపదార్థాలు నిషేధం అని చెబుతారు. సూర్యాస్తమయానికి ఒకటిన్నర గంటల మునుపు ప్రారంభమయ్యే ప్రదోషకాలం, సూర్యాస్తమయం తర్వాత ఒక గంట వరకూ ఉంటుంది. ఈ సమయంలోనే ప్రదోష వ్రతం నిర్వహించాలి. అంటే రెండున్నర గంటలపాటు పూజ జరుగుతుంది.

ప్రదోషం సందర్భంగా త్రయోదశి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. సాయంత్రం ఈ పూజ జరుగుతుంది. ఏ వయసు వారైనా, స్త్రీపురుష భేదం లేకుండా ప్రదోషవ్రతం ఆచరింపవచ్చు. స్కందపురాణం ప్రకారం ప్రదోష వ్రతాన్ని రెండు విధాలుగా ఆచరింపవచ్చు. మొదటిది రాత్రి, పగలు ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేయడం. రెండవ విధానం క్రింద సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం. సాయింత్రం శివపూజ జరిపిన తర్వాత ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తిచేయడం. నిర్వహించేవారి ఓపిక, సానుకూలత ప్రకారం వ్రతం జరపవచ్చు.

ప్రదోష వ్రత ఫలితాలు


ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి, అపవాదులు దూరమవుతాయి, వ్యాపార వ్యవహారాలలో నష్టా నివారణ జరుగుతుంది, సంతాన సాఫల్యం కలుగుతుంది, చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.

2018 సంవత్సరంలో ప్రదోష వ్రతం నిర్వహించాల్సిన తేదీలు



  • 14 జనవరి (ఆదివారం) ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 17:42 to 20:17

  • 29 జనవరి (సోమవారం) సోమ ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 17:51 to 20:24

  • 13 ఫిబ్రవరి (మంగళవారం) భౌమ ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 17:58 to 20:29

  • 27 ఫిబ్రవరి (మంగళవారం) భౌమ ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 18:03 to 20:31

  • 14 మార్చి (బుధవారం) ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:07 నుండి 20:32

  • 29 మార్చి (గురువారం) ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 18:09 నుండి 20:32

  • 13 ఏప్రిల్ (శుక్రవారము) ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:12 to 20:32

  • 27 ఏప్రిల్ (శుక్రవారము) ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 18:15 కు 20:33

  • 13 మే (ఆదివారం) ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:20 కు 20:35

  • 26 మే (శనివారం) శని ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 18:25 కు 20:38

  • 11 జూన్ (సోమవారము) సోమ ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:30 to 20:42

  • 25 జూన్ (సోమవారము) సోమ ప్రదోష్రావు (శుక్లపక్ష త్రయోదశి) 18:34 కు 20:45

  • 10 జూలై (మంగళవారం) భౌమ ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:45 కు 20:47

  • 24 జూలై (మంగళవారం) భౌమ ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 18:32 కు 20:46

  • 09 ఆగస్టు (గురువారం) ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:26 కు 20:42

  • 23 ఆగష్టు (గురువారం) ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 18:17 కు 20:36

  • 07 సెప్టెంబరు (శుక్రవారము) ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 18:06 నుండి 20:27

  • 22 సెప్టెంబర్ (శనివారం) శని ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 17:53 నుండి 20:17

  • 06 అక్టోబర్ (శనివారం) శని ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 17:42 to 20:09

  • 22 అక్టోబర్ (సోమవారము) సోమ ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 17:31 to 20:01

  • 05 నవంబర్ (సోమవారం) సోమ ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 17:24 కు 19:56

  • 20 నవంబర్ (మంగళవారం) భౌమ ప్రదోష వ్రతం (శుక్లపక్ష త్రయోదశి) 17:21 కు 19:55

  • 04 డిసెంబర్ (మంగళవారం) భౌమ ప్రదోష వ్రతం (కృష్ణపక్ష త్రయోదశి) 17:22 కు 19:58

  • 20 డిసెంబర్ (గురువారము) ప్రదోష్రాట్ (శుక్లపక్ష త్రయోదశి) 17:28 కు 20:04