సంక్రాంతి సంబరాల్లో భాగమైన గొబ్బిళ్ళ పండుగలో పాడుకును గొబ్బిళ్ల పాటలు మీ కోసం భక్తిసారం అందిస్తోంది.ఈ వీడియోలో అటవీ స్థలముల కరుగుదమా, సుబ్బీ గొబ్బెమ్మ అనే పాటలు మీకు 3,4 పాటలుగా అందిస్తున్నాము
సంక్రాంతి సంబరం అంతా గొబ్బిళ్ల వేడుకలలోనే కనిపిస్తుంది. ఇంటిముందు రంగవల్లుల్లాంటి కొత్త బట్టలు ధరించిన ఆడపిల్లు సప్తవర్ణాలు అద్దిన రంగవల్లుల మధ్యలో గొబ్బెమ్మలు ఉంచి వాటిని పూజించి అనంతరం గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే ఆ అందం ఆనందం మరొక సందర్భంలో రాదంటారు పెద్దలు. కానీ మన సనాతన సాంప్రదాయాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో మనం మర్చిపోతున్న గొబ్బెమ్మల పాటను మీకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా గొబ్బిపాటలను మీకు భక్తిసారం అందిస్తోంది. ఈ వీడియోలో అటవీ స్థలముల కరుగుదమా, సుబ్బీ గొబ్బెమ్మ అనే పాటలు మీకు 3,4 పాటలుగా అందిస్తున్నాము.