తిరుమలలో ” దైవ దీపావళి” నాడు గరుడునిపై విహరించిన మలయప్ప


”దైవ దీపావళి” గా పిలువబడే కార్తీకపౌర్ణమి పర్వదినాన శ్రీ మలపయప్పస్వామివారు గరుడుగమనుడై తిరుమల పురమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించాడు.

సాధారణంగా నరకచతుర్ధశి అనంతరం వచ్చే దీపావళి మానవులకు ప్రత్యేకమయితే, కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమినాడు సాక్షాత్తు ముక్కోటి దేవతలు దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని పురాణ ప్రాశస్తి. కనుకనే కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ”దైవదీపావళి” కూడా వ్యవహరిస్తారు.

గరుడవాహనం పురమాడ వీధులలో ముందుకు సాగుతుండగా దానికి ముందు ప్రదర్శించిన నాలాయిరం దివ్యప్రబంధ గోష్టి గానం మంత్రముగ్దంగా సాగింది.
Source