తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి నవంబరు 30వ తేదీ గురువారం ఘనంగా జరుగనుంది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది.
శ్రీవారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తి అయిన తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు మరియు యాత్రికులు మంగళవాయద్యాలతో స్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళతారు.
చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం మరియు ఆరాధన చేస్తారు. హారతి నివేదించిన అనంతరం తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.