అలిపిరి వద్ద నిషేధిత పదార్థాల సూచిక బోర్డుల ఏర్పాటు


తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులలో చైతన్యం నింపేందుకు నిషేధిత పదార్థాలతో కూడిన సూచిక బోర్డులను గురువారం టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం అలిపిరి టోల్‌గేట్‌, నడకదారి మార్గంలో ఏర్పాటు చేసింది.

దేశవిదేశాల నుండి విచ్చేసే శ్రీవారి భక్తులు తిరుమలలో వివిధ రకాల నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం, గుట్కాలు వంటి వాటిని తీసుకువెళ్లడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భక్తులను చైతన్యం చేసేందుకు తిరుపతి, తిరుమలలోని రద్దీ ప్రాంతాలలో ప్రధాన కూడళ్లలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.