చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానికాలయాల మూత



చంద్రగ్రహణం కారణంగా సోమవారం సాయంత్రం తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టిటిడి స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి మంగళవారం ఉదయం ఆలయాల తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

తిరుచానూరు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

శ్రీనివాసమంగాపురం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. 

చంద్రగిరి

ఉదయం 6.30 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయాన్ని సోమవారం సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

కోదండరామస్వామి ఆలయం-తిరుపతి

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

కపిలేశ్వరస్వామి ఆలయం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి అనంతరం ఉదయం 6 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.

అప్పలయగుంట

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మూసివేశారు. ఆగస్టు 8వ తేదీ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ఆలయం తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.