టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
- జూలై 26వ తేదీన చిత్తూరు జిల్లా జిడి.నెల్లూరు మండపం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- జూలై 27న చిత్తూరు జిల్లా పూతలపట్టులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- జూలై 28న అనంతపురం జిల్లా నార్పలలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- జూలై 29న అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- జూలై 30న అనంతపురం జిల్లా మడకసిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
Source