దేవీ నవరాత్రులు 2025: స్కందమాత ధ్యాన శ్లోకాలు

నవదుర్గలు అంటే దుర్గా దేవి యొక్క తొమ్మిది అవతారాలు. అవి: శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. దేవీ నవరాత్రుల్లో ఐదవరోజు దుర్గామాత స్కందమాత అలంకారంలో దర్శనమిస్తుంది. ఆ తల్లిని ఈ శ్లోకాలతో స్మరిస్తే అమ్మ సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. 


స్కందమాతా మంత్రం

ఓం దేవీ స్కందమాతాయై నమః 

స్కందమాతా ప్రార్ధన

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |

శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ || ౫ ||

స్కందమాతా స్తుతి

వందేవాంఛిత కామార్ధ చంద్రార్థకృత శేఖరాం

సింహరూఢా చతుర్భుజ స్కందమాతా యశస్వినీమ్


ధవళవర్ణ విశుద్ధ చక్రస్థితాంపంచమ దుర్గ త్రినేత్రామ్

అభయ పద్మయుగ్మ కరాందక్షిణ ఉరుపుత్రధరామ్ భజేమ్ 


పీతాంబర పరిధానాం మృదుహాస్య నానాలంకార భూషితామ్

మంజీర, హార, కేయూర, కింకిణీ రత్నకుండల ధారిణీం


ప్రఫుల్ల వదనాం పల్లవాంధరా కాంత కపోలాపీన పయోధరాం

కమనీయాం లావణ్యాం చారుత్రివలీ నితంబనీమ్ 

స్కందమాతా   ధ్యానం

నమామి స్కందమాతా స్కందధారిణీం 

సమగ్ర తత్వసాగర రమపారపార్ గహరాం


శివాప్రభా సముజ్జ్వలాం స్వచ్ఛరాగశేఖరామ్

లలాట రత్న భాస్కరాం జగత్ర్పియంతి భాస్కరాం 


మహేంద్ర కశ్యపార్చిత సనంతకుమార రసస్తుతాం

సురాసురేంద్రవందితా యదార్ధనిర్మలాద్భుతాం 


అతర్క్యరోచిరువిజాం వికార దోషవర్జితామ్

ముముక్షుభిర్విచింతతా విశేషతత్వముచితామ్


నానాలంకార భూషితామ్ మృగేంద్రవాహనాగ్రజామ్

 సుశుద్ధతత్వతోషణామ్ త్రివేంద్రమారభూషితామ్ 


సుధార్మికౌపకారిణీ సురేంద్ర కౌరి ధాతినీం

శుభాం పుష్పమాలినీ సుకర్ణకల్ప శాకినీమ్


తమోన్ధకారయామినీ శివస్వభావకామినీం 

సహస్రసూర్యరాజికా ధనోజ్జ్యోగకారికామ్


సుశుద్ధ కాలకందలా సుభదవృన్ద మంజులామ్

ప్రజాయినీ ప్రజావతీ నమామి మాతరం సతీమ్


స్వకర్మకారిణీ గతి హరిప్రయాచ పార్వతీమ్  

అనంతశక్తి కాంతిదాం యశో అర్థ భుక్తి ముక్తిదామ్


పునః పునః జగాద్ధితామ్ నమామ్యహం సురార్చితాం 

జయేశ్వరీ త్రిలోచనే ప్రసీద దేవి పాహిమామ్

ఇతి శ్రీ స్కందమాతా స్తోత్రం