తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణస్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో సోమవారం ఉదయం అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా సోమవారం ఉదయం 6 నుండి 7.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు కుంభ ప్రదక్షణ, ఉదయం 9.45 నుండి 10.25 గంటల మధ్య వృషభ లగ్నంలో కళావాహనము అక్షతారోహణం మహా సంప్రోక్షణ నిర్వహించారు.
గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం మార్చి 1 నుండి 3వ తేదీ వరకు ”బాలాలయం” సంప్రోక్షణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేశారు.